Hyderabad: హైదరాబాద్ లో మహిళపై గ్యాంగ్ రేప్, నలుగురు యువకులు అరెస్ట్

భయంతో ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది.

Published By: HashtagU Telugu Desk
Gang Raped

Gang Raped

Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళపై ఐదుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. చంపేస్తామని బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. భయంతో ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

వివరాల ప్రకారం.. డిసెంబరు 7న నగరంలోని తార్నాకలోని బస్టాప్‌లో ఓ మహిళ వేచి ఉండగా.. బైక్‌పై వెళ్తున్న బర్నా యేసు(32) బస్సు కోసం వేచి ఉన్న మహిళను చూసి ఆగాడు. ఆమె పరిస్థితి తెలుసుకున్న తర్వాత బైక్‌పై దింపాలని నిర్ణయించుకున్నాడు. లాలాపేటకు తీసుకెళ్తానని చెప్పిన యేసు.. ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితులను పిలిచి వారితో పాటు బాధితురాలిపై దాడికి పాల్పడ్డాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించి తార్నాకలో వదిలేశారు. భయాందోళనకు గురైన బాధితురాలు మొదట మౌనంగా ఉండి చివరకు లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తార్నాక బస్టాప్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో బర్నా యేసుతో పాటు మధుయాదవ్ (31), ప్రశాంత్ (20), తరుణ్ (20), రోహిత్ (19)లను అదుపులోకి తీసుకున్నారు.

  Last Updated: 18 Dec 2023, 01:26 PM IST