G20 Agriculture Summit: హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ సమిట్

నగరంలో మూడు రోజులు పాటు జీ20 దేశాల అగ్రికల్చర్ సమ్మిట్ జరగనుంది. జూన్ 15 నుంచి 17 వరకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఈ సదస్సుకు వేదిక కానుంది.

G20 Agriculture Summit: – హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ సమిట్
– హాజరు కానున్న 30 దేశాల ప్రతినిధులు
– నేషనల్‌‌, ఇంటర్నేషనల్‌‌ మేధావులతో రాష్ట్ర అధికారులు కో ఆర్డినేషన్‌‌

నగరంలో మూడు రోజులు పాటు జీ20 దేశాల అగ్రికల్చర్ సమ్మిట్ జరగనుంది. జూన్ 15 నుంచి 17 వరకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఈ సదస్సుకు వేదిక కానుంది.

భారత్ లో ఇప్పటివరకు మూడు అగ్రికల్చర్‌‌ జీ20 సదస్సులు జరిగాయి. మొదటి సదస్సు ఫిబ్రవరిలో మధ్య ప్రదేశ్‌‌లో జరిగింది. రెండో సదస్సు(అగ్రికల్చర్‌‌ డిప్యూటీస్‌‌ మీటింగ్‌‌) మార్చిలో చండీగఢ్‌‌లో నిర్వహించారు. మూడో సదస్సు (అగ్రికల్చర్‌‌ ప్రిన్సిపల్‌‌ సైంటిస్టుల సదస్సు) ఏప్రిల్‌‌ లో వారణాసిలో మూడు రోజులపాటు జరిగింది. ప్రస్తుతం నాలుగో అగ్రికల్చర్‌‌ సమ్మిట్ (g20 agriculture summit) కు ​ హైదరాబాద్‌‌ వేదికైంది.

ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్‌‌ను ప్రోత్సహించే క్రమంలో ఈ సదస్సులను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ ఏడాదిని మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్ర అధికారులు నేషనల్‌‌, ఇంటర్నేషనల్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌ తో కో ఆర్డినేషన్‌‌ అయి ఈ సమ్మిట్​ సన్నాహక ఏర్పాట్లు జరుపుతున్నారు. దీనికి రాష్ట్ర వ్యవసాయశాఖ నాయకత్వం వహిస్తుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సదస్సుని నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన అగ్రికల్చర్‌‌ మినిస్టర్లు ఈ సమిట్ లో పాల్గొంటారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇటలీ, ఫ్రాన్స్ , ఇండియా, జర్మనీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, యూకే, యూఎస్‌‌ఏ, యూరోపియన్‌‌ మరియు ఇతర దేశాల ప్రతినిధులు ఈ సమిట్ లో మాట్లాడనున్నారు.

Read More: Dr. Br Ambedkar : ఈరోజు డా.బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కంచు విగ్రహం ఆవిష్కరణ..