Nehru Zoo Park: నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో వినోదాత్మక కార్యక్రమాలు

నెహ్రూ జూలాజికల్ పార్క్ లో వినోదాత్మక కార్యక్రమాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్నినాయించింది. ఈ మేరకు ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖతో కలిసి జూలై 28న ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని

Nehru Zoo Park: నెహ్రూ జూలాజికల్ పార్క్ లో వినోదాత్మక కార్యక్రమాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖతో కలిసి జూలై 28న ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని అదేవిధంగా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరపనుంది. ఈ రెండు రోజులు సందర్శకుల సమక్షంలో అనేక వినోద కార్యక్రమాలు మరియు పోటీలు నిర్వహించనుంది. ప్రకృతి పరిరక్షణ దినోత్సవం రోజున జూ పార్క్‌లో జరిగే ఈ కార్యక్రమాల్లో అన్ని వయసుల వారు చురుకుగా పాల్గొనేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రకృతి పరిరక్షణ క్విజ్, వన్యప్రాణుల గురించి ప్రశ్నలతో పాటు డ్రాయింగ్ మరియు క్రాఫ్ట్-మేకింగ్ సెషన్ జూలై 28న జరపనున్నారు. జులై 29న అంతరించిపోతున్న పులుల జాతుల గురించి, వాటి రక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వారు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

Also Read: Prathinidhi 2 : ఆసక్తిరేపుతున్న ‘ప్రతినిధి 2’ కాన్సెప్ట్​ టీజర్ ..