Site icon HashtagU Telugu

Yasin Malik : సుప్రీంకోర్టులో యాసిన్ మాలిక్‌.. నలుగురు జైలు అధికారుల సస్పెన్షన్‌.. ఎందుకు ?

Yasin Malik Death Penalty

Yasin Malik Death Penalty

Yasin Malik : టెర్రర్ ఫండింగ్ కేసులో తీహార్ జైలులో యావజ్జీవ ఖైదు శిక్షను అనుభవిస్తున్న వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌ ను అనుమతి లేకుండా సుప్రీంకోర్టుకు తీసుకొచ్చిన వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణ జరిపిన తీహార్ జైలు ఉన్నతాధికారులు మొత్తం నలుగురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. వీరిలో ఒక డీఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు, ఒక జైలు వార్డెన్‌ ఉన్నారు.

Also read : CM KCR: కామారెడ్డి లేదా పెద్దపల్లి.. కేసీఆర్ పోటీ చేసేది ఇక్కడ్నుంచే?

అసలు ఏం జరిగిందంటే .. ? 

ఓ కేసులో యాసిన్‌ మాలిక్‌ (Yasin Malik)  వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలో జమ్మూలోని ఓ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, ఈ ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం నిలుపుదల చేసింది. దీంతో వ్యక్తిగత హాజరుకు అవకాశమివ్వాలంటూ మే 16న సుప్రీం కోర్టుకు మాలిక్‌ లేఖ రాశారు. దీన్ని అందుకున్న సుప్రీంకోర్టు సహాయ రిజిస్ట్రార్‌.. ఇందుకు న్యాయస్థానం అవసరమైన ఉత్తర్వులను జారీ చేస్తుందని ఈ నెల 18న బదులిచ్చారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న జైలు అధికారులు.. భారీ భద్రత నడుమ మాలిక్‌ను శుక్రవారం సుప్రీం కోర్టుకు తీసుకెళ్ళడం కలకలం సృష్టించింది.

Also read : Deers Video: పంట పొలాల్లో జింకల సందడి, వీడియో వైరల్

వ్యక్తిగతంగా మాలిక్‌ను హాజరుపర్చాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం పేర్కొంది. అక్కడే ఉన్న సొలిసిటర్‌ జనరల్‌.. జైలు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్ర భద్రతా లోపంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాశారు. ఈ పరిణామాల నడుమ తాజాగా నలుగురు పోలీసు అధికారులపై వేటు పడింది.