Bagalkot: కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ బాలికతో సహా నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. జిల్లాలోని జమఖండి పట్టణానికి సమీపంలో ఉన్న అలగూర్ గ్రామ సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
పాఠశాల వార్షికోత్సవం అనంతరం విద్యార్థులు గ్రామంలోని తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు కవటగి గ్రామానికి చెందిన 17 ఏళ్ల సాగర్ కడ్కోల్ మరియు బసవరాజ్, 13 ఏళ్ల శ్వేత మరియు గోవింద్‌గా గుర్తించారు. ఆలగూర్‌లోని వర్ధమాన విద్యాసంస్థలో విద్యార్థులు చదువుతున్నారు. సాగర్, బసవరాజ్ పీయూసీ విద్యార్థులు కాగా, శ్వేత, గోవింద్ 9వ తరగతి చదువుతున్నారు.
ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా పోలీసులు తేల్చలేదు. బాగల్‌కోట్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయిన ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్ గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చడంతోపాటు ఆసుపత్రిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read: Road Accident: నల్లగొండ జిల్లాలో ఘోర రొడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం