Site icon HashtagU Telugu

Gujarat: గుజరాత్‌లో విషాదం: వర్షానికి గోడకూలి నలుగురు చిన్నారులు మృతి

Gujarat

29 06 2023 Gujarat Wall Collapse 23455874

Gujarat: గుజరాత్‌లోని హలోల్‌లోని పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఫ్యాక్టరీ గోడ కూలి పక్కనే ఉన్న తాత్కాలిక టెంట్లపై పడింది. ఈ ప్రమాదంలో ఐదేళ్లలోపు నలుగురు చిన్నారులు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. బాధితులు మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ కుటుంబంతో పాటు బంధువులు హలోల్ తాలూకాలోని చంద్రపురా గ్రామంలో ఉన్న ఒక రసాయన కర్మాగారానికి సమీపంలో ఉన్న నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు.

ఈ ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మహిళలు మరియు ఇద్దరు పిల్లలతో సహా మిగిలిన ఐదుగురిని హలోల్‌లోని ఎస్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే గాయపడిన మరొకరి పరిస్థితి క్లిష్టంగా మారడంతో చికిత్స కోసం వడోదరలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారులను ఐదేళ్ల చిరిరామ్ దామోర్, నాలుగేళ్ల అభిషేక్ భూరియా, రెండేళ్ల గుంగున్ భూరియా, ఐదేళ్ల ముస్కాన్ భూరియాగా గుర్తించారు.

ఇదిలా ఉండగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత 36 గంటల్లో దక్షిణ గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని, మరో రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read More: WhatsApp New Feature: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టండిలా?