హోంమంత్రి అనిత(Home minister Anitha)పై మాజీ మంత్రి అమర్నాథ్ (Amarnath Reddy) తీవ్ర విమర్శలు చేశారు. తన గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం కంటే అనిత తన రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేయడం మంచిదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదని అమర్నాథ్ ఆరోపించారు. 8 నెలల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, పైగా ప్రభుత్వ విధానాల వల్ల వాలంటీర్లకు అన్యాయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పారు.
Rain Free In Cafe : ఈ కేఫ్‌లో వర్షం ఫ్రీ.. కాఫీని సిప్ చేయగానే జోరువాన
రెండున్నర లక్షల మంది వాలంటీర్లను తొలగించడంపై అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సేవలను అప్రతిష్టపరిచిన ఈ చర్య తగదని అన్నారు. రేపు మరిన్ని ఉద్యోగులను తొలగించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా అందడం లేదని అమర్నాథ్ విమర్శించారు.
ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించలేకపోతున్న ప్రభుత్వం, మరోవైపు ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వడంలో విఫలమవుతోందని అన్నారు. ఇది ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక కష్టాలను తెలుపుతున్నదని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ కారణంగా ప్రజల నమ్మకానికి గండి పడుతుందని అమర్నాథ్ అన్నారు. తక్షణమే ప్రభుత్వ విధానాలను పునరాలోచించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.