Food Free: 158 కేజీల కంటే ఎక్కువ బరువున్న వాళ్లకు ఫుడ్ ఫ్రీ..?

మీ బరువు 158 కేజీల కంటే ఎక్కువుందా ? అయితే మీకు ఫుడ్ ఫ్రీ " అంటోంది అమెరికాలోని లాస్ వేగాస్ లో ఉన్న ఒక హాస్పిటల్ థీమ్ రెస్టారెంట్. దాని పేరు ఏంటో తెలుసా?"

“మీ బరువు 158 కేజీల కంటే ఎక్కువుందా ? అయితే మీకు ఫుడ్ ఫ్రీ (Food Free)” అంటోంది అమెరికాలోని లాస్ వేగాస్ లో ఉన్న ఒక హాస్పిటల్ థీమ్ రెస్టారెంట్. దాని పేరు ఏంటో తెలుసా? “హార్ట్ ఎటాక్ గ్రిల్”. ఈ ఆఫర్ గురించి విన్న ఎంతోమంది రోజూ రెస్టారెంట్ ముందు క్యూ కడుతున్నారు. తమ బరువు 158 కేజీలు ఉందా ? లేదా ? అని చెక్ చేసు కుంటున్నారు. టిక్ టాక్ , ట్విట్టర్, ఇతరత్రా సోషల్ మీడియాలలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆఫర్ డేంజరస్ అని.. ఇప్పటికే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లకు అన్ లిమిటెడ్ ఫుడ్ ఫ్రీగా (Food Free) ఇస్తే ఆరోగ్యం మరింత పాడవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎన్నో కామెంట్స్ పెడుతున్నారు.”హార్ట్ ఎటాక్ గ్రిల్ అనేది జైలుకు వెళ్లడం కంటే భయంకరంగా కనిపిస్తోంది” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. “పేరుకు తగ్గట్టుగానే ఆ రెస్టారెంట్.. ఓవర్ వెయిట్ కలిగిన వాళ్లకు ఓవర్ ఫుడ్ తినిపించి హార్ట్ ఎటాక్ వచ్చేలా చేస్తుందేమో” అని మరొకరు వ్యాఖ్య చేశారు. “20000 క్యాలరీల శక్తి ఉండే ఆక్టుఫుల్ బైపాస్ బర్గర్ ను ఆ రెస్టారెంట్ లో తినిపిస్తున్నట్టు చెబుతున్నారు వామ్మో” అంటూ ఇంకో వ్యక్తి కామెంట్ పెట్టాడు.

కస్టమర్ = పేషెంట్, వెయిటర్ = డాక్టర్:

ఇక “హార్ట్ ఎటాక్ గ్రిల్” రెస్టారెంట్ బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే.. అది 2005లో ఏర్పాటైంది. హై క్యాలరీస్ ఉండే జంక్ ఫుడ్ కు ఇది కేరాఫ్ అడ్రస్. ఈ రెస్టారెంట్ ను హాస్పిటల్ థీమ్ లో నిర్మించారు. ఇందులోకి వచ్చే కస్టమర్లను పేషెంట్స్ అని పిలుస్తారు. ఈ రెస్టారెంట్ లో పనిచేసే పురుష వెయిటర్లను డాక్టర్స్ అని.. మహిళా వెయిటర్లను నర్సెస్ అని పిలుస్తారు. పేరే కాదు.. వాళ్ళ యూనిఫామ్స్ కూడా అదే విధంగా ఉంటాయి. ఈ రెస్టారెంట్ లోకి అడుగుపెట్టిన వ్యక్తిని ఒక పేషెంట్ లాగా అందులోని స్టాఫ్ రిసీవ్ చేసుకుంటారు. ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. లోపలికి వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కస్టమర్ హాస్పిటల్ గౌన్ వేసుకొని పేషెంట్ లాగా మారిపోతాడు.

ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ (Food) తినకుంటే ఏం చేస్తారంటే..

ఈ రెస్టారెంట్ లోని ఫుడ్ మెనూ కూడా హాస్పిటల్ ను తలపించేలా ఉంటుంది. సింగిల్ బైపాస్ బర్గర్, ది ఆక్టుపుల్ బైపాస్ బర్గర్, ఫ్లాట్ లైనర్ ఫ్రయిస్, బటర్ ఫ్యాట్ మిల్క్ షేక్స్ మొదలైనవి. ఇక్కడి ఫుడ్స్  “సింగిల్,” “డబుల్,” “ట్రిపుల్,” “క్వాడ్రపుల్,” “క్వింటపుల్,” “సెక్స్‌టపుల్,” “సెప్టుపుల్,” మరియు “ఆక్టపుల్ బైపాస్” మోతాదులలో లభిస్తాయి. సాధారణంగా ఇటువంటి ఫుడ్స్ తింటే గుండెపోటు వచ్చే ముప్పు పెరుగుతుంది. ఈ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ను పూర్తిగా తినకపోతే చివర్లో వెళ్ళేటప్పుడు పిరుదులపై చాచి కొడతారు. ట్రిపుల్ లేదా క్వాడ్రపుల్ బైపాస్ బర్గర్‌ను పూర్తి చేసిన వారిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి “పర్సనల్ నర్సు” ద్వారా వారి వాహనం దాకా సాగనంపుతారు. ఈ రెస్టారెంట్ లో రెగ్యులర్ గా ఫుడ్ తిన్న ఎంతోమంది హార్ట్ ప్రాబ్లమ్స్ తో చనిపోయారని చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ హార్ట్ ఎటాక్ గ్రిల్ రెస్టారెంట్ మార్కెటింగ్ వ్యూహం వివాదాస్పదంగా మారింది.

Also Read:  Shraddha Kapoor: ఫ్లూని కొట్టడానికి నేను కడా తాగుతాను. మీరందరూ త్వరగా నా సినిమా చూడడానికి వెళ్లండి