Telangana: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఫిల్మ్‌నగర్ కల్చరల్ కమిటీ (ఎఫ్‌ఎన్‌సిసి) సన్మానించింది. ఈ కార్యక్రమానికి ఫిలింనగర్ కల్చరల్ కమిటీ (ఎఫ్‌ఎన్‌సిసి) అధ్యక్షులు ఆదిశేషగిరి, కార్యదర్శి ముళ్లపూడి మోహన్, సంయుక్త కార్యదర్శి పెద్ది రాజు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ఇతర కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడ్డం ప్రసాద్‌ను ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్ష, కార్యదర్శులు పుష్పగుచ్ఛం, శాలువా కప్పి సత్కరించారు.
నిర్మాత, ఎఫ్‌ఎన్‌సీసీ కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ.. గడ్డం ప్రసాద్‌కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎఫ్‌ఎన్‌సీసీకి ఆహ్వానం పంపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు కమిటీ సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఈ సన్మానానికి తనను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎఫ్‌ఎన్‌సీసీ ద్వారా ఇక్కడికి రావడమే కాకుండా తన స్నేహితులను కూడా ఇలా కలవడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్‌ఎన్‌సీసీకి అవసరమైన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని గడ్డం ప్రసాద్ కుమార్ తెలియజేశారు. తనను ఆహ్వానించి సన్మానించినందుకు ఎఫ్‌ఎన్‌సీసీ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Papaya Fruit Benefits : బొప్పాయి పండు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?