Hijack : విమానంలో హైజాక్ ప్లాన్.. అతడి బ్యాక్ గ్రౌండ్ బట్టబయలు

Hijack : అది విస్తారా విమానం.. ఇంకొన్ని సెకన్లలో ముంబై సిటీ నుంచి టేకాఫ్ అవుతుంది. ఈ టైంలో విమానంలో కూర్చున్న ఒక ప్యాసింజర్(23) తన ఫోన్‌ తీసి ఎవరితోనో కాల్ కలిపి మాట్లాడాడు.. 

Published By: HashtagU Telugu Desk
Kandahar Hijack

Kandahar Hijack

Hijack : అది విస్తారా విమానం..

ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరింది.. 

ఇంకొన్ని సెకన్లలో ముంబై సిటీ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుంది. 

సరిగ్గా ఈ టైంలో విమానంలో కూర్చున్న ఒక ప్యాసింజర్(23) తన ఫోన్‌ తీసి ఎవరితోనో కాల్ కలిపి మాట్లాడాడు.. 

‘అహ్మదాబాద్ కా ఫ్లైట్ బోర్డ్ కర్నే వాలా హై. కోయి భీ దిక్కత్ హో తో ముఝే కాల్ కర్నా’ (అహ్మదాబాద్‌కి వెళ్లే విమానం ఎక్కుతాను. మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే నాకు కాల్ చేయండి)  అని ఫోన్ లో చెప్పాడు. ‘హైజాక్ (Hijack) కా సారా ప్లానింగ్ హై. ఉస్కా సారా యాక్సెస్  హై. చింతా మత్ కర్నా’  (హైజాకింగ్‌కు సంబంధించిన అన్ని ప్రణాళికలు ఉన్నాయి. అన్నింటికీ  యాక్సెస్ ఉన్నందున చింతించకండి) అని అన్నాడు.. ఆ వ్యక్తి ఫోన్ సంభాషణను క్యాబిన్ సిబ్బంది, ఇతర ప్రయాణికులు విన్నారు. అది విన్నాక వారు భయపడ్డారు. ప్రయాణికుల్లో చాలామంది లేచి నిలబడ్డారు.

Also read : Royal Enfield Classic 650: మార్కెట్ లోకి రాయల్ ఎన్ ఫీల్డ్ సరికొత్త బైక్.. ధర ఫీచర్స్ ఇవే?

వెంటనే  క్యాబిన్ సిబ్బంది విమానంలోని భద్రతా సిబ్బందిని పిలిపించి.. ఆ ఫోన్ సంభాషణ చేసిన ప్రయాణికుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి అప్పగించారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రయాణికుడి పేరు రితేష్ జునేజా అని గుర్తించారు. అతడిని ముంబైలోని సహర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, క్యాబిన్ క్రూ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 336, 505 (2), ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు అయింది. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని.. 2021 నుంచి వైద్య చికిత్స పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈవివరాలను విస్తారా ఎయిర్‌లైన్ ప్రతినిధి ధృవీకరించారు.

  Last Updated: 23 Jun 2023, 04:28 PM IST