Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు రెండున్నర గంటలు బ్రేక్‌.. ఎందుకో తెలుసా..?

మీరు ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) నుండి విమానంలో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే అల‌ర్ట్‌గా ఉండండి. ఎందుకంటే ఈ విమానాశ్రయంలో 8 రోజుల పాటు రెండున్నర గంటలపాటు విమానాల రాకపోకలకు విరామం ఉంటుంది.

  • Written By:
  • Updated On - January 19, 2024 / 09:04 PM IST

Delhi Airport: మీరు ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) నుండి విమానంలో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే అల‌ర్ట్‌గా ఉండండి. ఎందుకంటే ఈ విమానాశ్రయంలో 8 రోజుల పాటు రెండున్నర గంటలపాటు విమానాల రాకపోకలకు విరామం ఉంటుంది. వాస్తవానికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో నేటి నుండి జనవరి 26 వరకు ఢిల్లీ విమానాశ్రయంలో ఉదయం 10:20 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఎటువంటి విమానాలు నడపబడవు.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ఈ నోటీసును పోస్ట్ చేసింది. NOTAM (నోటీస్ టు ఎయిర్‌మెన్) నోటీసు ప్రకారం.. జనవరి 19-26 మధ్య ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం 10.20 నుండి మధ్యాహ్నం 12.45 గంటల మధ్య విమానాలు పనిచేయవు. అంటే ఈ 2 గంటల 25 నిమిషాలలో ఢిల్లీ విమానాశ్రయంలో ఏ విమానం ల్యాండ్ అవ్వదు లేదా టేకాఫ్ చేయదని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Also Read: 2024 Oscar Nominations : 2024 ఆస్కార్ నామినేషన్స్ కు నాని మూవీ

ఈ సమయంలో వచ్చే 8 రోజుల పాటు ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయం నుండి ప్రయాణించకుండా ఉండాలి. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి ఎవరు?

ఈ ఏడాది దేశంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఈ ఏడాది రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఫ్రాన్స్ నాయకుడు పాల్గొనడం ఇది ఆరోసారి. ఈసారి కవాతు ప్రత్యేకంగా ఉండ‌నుంది. ఎందుకంటే ఈ సంవత్సరం BSF మహిళలు, బ్రాస్ బ్యాండ్ కంటెంజెంట్లు కవాతులో పాల్గొంటారు.

We’re now on WhatsApp. Click to Join.