Site icon HashtagU Telugu

Rythu Bandhu: రైతుబంధుకు ఐదేళ్లు.. వర్ధిల్లాలి వెయ్యేళ్లు!

Rythubandhu 1 4732 Imresizer

Rythubandhu 1 4732 Imresizer

రైతులకు పంట సాయం కోసం తెలంగాణ (Telangana) ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకానికి రైతుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ అయ్యింది. ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రపంచ ఆహార సంస్థ (FAO) 2018 – 19లో ప్రపంచంలో రైతులకు ఉపయోగపడే మేటి 20 పథకాలలో రైతుబంధు, రైతుభీమాను గుర్తించడం దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో రైతుబంధుకు ఐదేళ్లు కావడంతో మంత్రి హరీశ్ (Harish Rao) ట్వీట్ చేశారు.

‘‘సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు (Rythu Bandhu) వ్యవసాయాన్ని, పండగ చేసి రైతన్నను రాజును చేసింది. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్ అయ్యింది. అందుకే సీఎం కేసీఆర్ గారు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తున్నాయి. అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ అంటూ బి ఆర్ ఎస్ ను స్వాగతిస్తున్నాయి’’ అని ట్వీట్ చేశారు.

Also Read: Eggs: రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే!