Hyderabad: నీటిలో మునిగి ఐదేళ్ల బాలుడు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ నీటిలో పడిన ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Hyderabad: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ నీటిలో పడిన ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు తమతో ఉన్న బాలుడు తిరిగిరానిలోకాలకు వెళ్లడం స్థానికంగా కన్నీరుపెట్టించింది. వివరాలలోకి వెళితే..

ఫలక్‌నుమాలో నివాసం ఉంటున్న రెండు కుటుంబాలు ప్రార్ధనలు ముగించుకుని సరదాగా సందర్శన ప్రదేశానికి వెళ్లారు. వారంతా సంతోషంగా గడుపుతున్న సమయంలో ఐదేళ్ల మహ్మద్ అఫ్ఫాన్ బోటింగ్ వైపు వెళ్ళాడు. అయితే గత 24 గంటలుగా బోటింగ్ మూసివేసి ఉండటంతో ఆ ప్రదేశంలో ఎవరు లేకపోవడంతో బాలుడిని ఎవరూ గుర్తించలేదు. దాంతో బాలుడు నీటిలో పడి మునిగిపోయాడు. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు బాలుడి కోసం వెతకగా నీటిలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు బాలుడిని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కొత్తూరు పోలీసులు 174 సీఆర్‌పీసీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read More: Robbery: ఆలయంలో చోరీకి ప్రయత్నించిన దొంగలు.. సీసీ కెమెరాల కంట పడడంతో?