Five Boys Drown : సముద్రంలో మునిగిన ఐదుగురు చిన్నారులు

Five Boys Drown : ముంబై తీరంలోని సముద్ర జలాల్లో ఐదుగురు చిన్నారులు ప్రమాదవశాత్తూ మునిగిపోయారు.

Published By: HashtagU Telugu Desk
Five Boys Drown

Five Boys Drown

Five Boys Drown : ముంబై తీరంలోని సముద్ర జలాల్లో ఐదుగురు చిన్నారులు ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. వీరిలో ఇద్దరిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీసుకురాగా, మరో ముగ్గురి జాడ గల్లంతయింది. వీరంతా 12 నుంచి 16 ఏళ్ల లోపువారే. ఆదివారం ఉదయం 9.38 గంటలకు మలద్ వెస్ట్‌లో ఉన్న మార్వే క్రీక్‌లోని షోర్‌లైన్‌ నుంచి సుమారు అరకిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో ఈ బాలురు మునిగిపోయారు.

Also read : South Korea: దక్షిణ కొరియాలో మరో విషాదం.. ఒక్కసారిగా సొరంగం లోకి మెరుపు వరద?

గల్లంతైన బాలురి కోసం(Five Boys Drown) ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, పోలీసులు, తీరప్రాంత గస్తీ దళం, నేవీ డైవర్లు గాలిస్తున్నారు. సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన ఇద్దరు చిన్నారులను కృష్ణ జితేంద్ర హరిజన్ (16), అంకుష్ భరత్ శివారే(13)లుగా గుర్తించారు. శుభం రాజ్‌కుమార్ జైశ్వాల్ (12), నిఖిల్ సాజిద్ కయంకూర్ (13), అజయ్ జితేంద్ర హరిజన్ (12) జాడ గల్లంతైంది.

  Last Updated: 16 Jul 2023, 04:18 PM IST