Telangana Monsoon: తెలంగాణలో ఉక్కపోతకు బ్రేక్ పడింది. గత వారం రోజులుగా తెలంగాణాలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. అయితే ఈ రోజు రుతుపవనాలు తొలిసారిగా తెలంగాణలోని పలు ప్రాంతాలను తాకడంతో నగరంలో కొన్నిచోట్ల చినుకులు, చెదురుమదురు వర్షాలు కురిశాయి. దీంతో నగర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించినట్లైంది.
Enjoying the first monsoon rain 😌🌧️❤️#HyderabadRains pic.twitter.com/zKe1gwLBFs
— Telangana Weatherman (@balaji25_t) June 21, 2023
రుతుపవనాలు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని తాకాయి. ఈ సందర్భంగా నల్గొండ, యాదాద్రి-భోంగిర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ లో కాప్రా, ఈసీఐఎల్, చెర్లపల్లి, మల్లాపూర్, నాచారం, చెంగిచెర్ల, నేరేడ్‌మెట్, బోడుప్పల్ మండలాల్లో వర్షం పడింది. నగరంలో ఎక్కడ చూసినా మబ్బులు కమ్ముకున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. అయితే IMD హైదరాబాద్ సూచన ప్రకారం జూన్ 23 వరకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 36-40 డిగ్రీల సెల్సియస్‌లో ఉండే అవకాశం ఉంది.
Read More: Cucumber benefits: వేసవిలో దోసకాయ.. ఆరోగ్యంతో పాటు ఆ సమస్యలకు చెక్?