తెలంగాణ లో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ తరుణంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల లిస్ట్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే బిజెపి పార్టీ తమ మొదటి ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించగా..ఇక ఇప్పుడు అధికార పార్టీ బిఆర్ఎస్ సైతం ఫస్ట్ లిస్ట్ (BRS Candidates List) ను ప్రకటించబోతున్నట్లు వినికిడి. 105 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ ను కేసీఆర్ సిద్ధం చేశారట.
తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) దేవుళ్లను, జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఆయన లక్కీ నెంబర్ 6. ఆ సంఖ్య వచ్చే రోజుల్లోనే కేసీఆర్ ముఖ్యమైన పనులు చేస్తుంటారని అంత అంటుంటారు. ఎన్నికల అభ్యర్థుల లిస్ట్ ను కూడా అవన్నీ చూసుకొనే ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ఈ నెల 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. 18న శ్రావణ మొదటి శుక్రవారం ఉంది. అదే రోజు లేదా ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఫస్ట్ లిస్టులోనే 105 పేర్లు ప్రకటించే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ 105 పేర్లు ప్రకటించకుంటే.. కేసీఆర్ లక్కీ నంబర్అయిన ‘6’ సంఖ్య వచ్చేలా అభ్యర్థుల లిస్ట్ ఉండొచ్చని అంటున్నారు. అలాగే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలామందికి టికెట్ ఇవ్వడం లేదట.
పదేళ్లుగా అధికారంలో ఉండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తి ఉన్నారు. ముఖ్యంగా 40 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని.. వారిలో అతి ఎక్కువ వ్యతిరేకత ఉన్న 20 మందిని పక్కకు పెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడట. మరి వీరిలో ఎవరికీ టికెట్ దక్కుతుందో..ఎవరికీ టికెట్ దక్కదో..టికెట్ దక్కని వారు బిఆర్ఎస్ లో ఉంటారో..ఉండరో అనేది ఆసక్తి గా మారింది.
Read Also : T Congress New Strategy : తెలంగాణ కాంగ్రెస్ కు `సెంథిల్` బూస్టప్! షర్మిల హైలెట్ !