Aditya-L1: తొలి భూ కక్ష్య రైజింగ్ మిషన్ విజయవంతం

ఇస్రో దేశంలోనే తొలి సోలార్ అబ్జర్వేషన్ శాటిలైట్ 'ఆదిత్య-ఎల్1'ని నిర్దేశిత భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో తొలిసారిగా భూ కక్ష్య రైజింగ్‌ విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో

Aditya-L1: ఇస్రో దేశంలోనే తొలి సోలార్ అబ్జర్వేషన్ శాటిలైట్ ‘ఆదిత్య-ఎల్1’ని నిర్దేశిత భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో తొలిసారిగా భూ కక్ష్య రైజింగ్‌ విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ఈ రోజు ఆదివారం ప్రకటించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)’ నుంచి ఈ ప్రక్రియ చేపట్టామని తెలిపింది. దీంతో ‘ఆదిత్య-ఎల్1’ ఇప్పుడు 245×22,459 కి.మీ దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించింది. మిషన్ సజావుగా సాగుతోందని, సెప్టెంబరు 5 ఉదయం 3 గంటలకు రెండో ఆర్బిట్ రైజింగ్ విన్యాసాన్ని చేపడతామని తెలిపింది.

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ57 ఉపగ్రహం ‘ఆదిత్య-ఎల్‌1’ శనివారం దూసుకుపోయింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 1480.7 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ‘ఆదిత్య-ఎల్1’ 16 రోజుల పాటు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత భూమిపైకి 15 లక్షల కి.మీ. దూరంలోని నిర్దేశిత L1 పాయింట్ వైపు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తామని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగంలో భాగంగా సూర్యుని బయటి పొరలను అధ్యయనం చేస్తారు. ఇది సౌర మంటలు, సౌర కణాలు మరియు అక్కడి వాతావరణం యొక్క అనేక అంశాలను అన్వేషిస్తుంది.

Also Read: Most Weak Currencies : ప్రపంచంలోనే వీక్ కరెన్సీలు ఏమిటో తెలుసా ?