Hyderabad: హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పరిధిలోని ఓ దుకాణంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Published By: HashtagU Telugu Desk
Hyderabad (17)

Hyderabad (17)

Hyderabad: హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పరిధిలోని ఓ దుకాణంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నామని, అయితే ఇంకా పూర్తి తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

వనస్థలిపురం పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 6:00 గంటలకు వనస్థలిపురంలోని ఒక దుకాణంలో మంటలు చెలరేగినట్లు కాల్ వచ్చింది. అగ్నిప్రమాదానికి కారణం షార్ట్‌సర్క్యూటేనని అనుమానిస్తున్నప్పటికీ అది ఖచ్చితంగా తెలియలేదు. స్కూల్ బ్యాగులు, లగేజీ బ్యాగులు తదితర బ్యాగులను విక్రయిస్తున్న రెండు షట్టర్ల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని అధికారి తెలిపారు.ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Dussehra: దసరా నవరాత్రుల్లో గాయత్రి దేవి విశిష్టత గురించి మీకు తెలుసా

  Last Updated: 16 Oct 2023, 10:19 AM IST