Site icon HashtagU Telugu

Fire Accident: నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్ దగ్ధం

fire accident

Resizeimagesize (1280 X 720) (5)

నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. కలెక్టరేట్ ప్రాంగణంలోని స్టోర్ రూమ్ లో ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలోపలు డాక్యుమెంట్స్ తో పాటు ఫర్నీచర్ దగ్ధమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆకస్మాతుగా ఫైర్ యాక్సిడెంట్ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ కలెక్టరేట్ ఆఫీసు వెనక భాగంలో ఉన్న ఈ స్టోర్ రూమ్‌లో గత ఎన్నికలకు సంబంధించి కొన్ని పత్రాలు, పాత ఫర్నీచర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

Also Read: Train: పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. మహిళకు తప్పిన ప్రమాదం