ఎల్ & టీ గెస్ట్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబత్‌పల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో ఉన్న లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్&టి) గెస్ట్‌హౌస్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భవనంలోని చాలా భాగం పూర్తిగా కాలిపోయింది. సమీపంలోని పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చుతుండగా మంటలు చెలరేగి, ప్రమాదవశాత్తు గెస్ట్ హౌస్‌కు వ్యాపించాయని ప్రాథమిక సమాచారం. భవనం రెండు వైపులా విస్తరించి ఉందని, అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఒక వైపు పూర్తిగా కూలిపోయిందని జయశంకర్-భూపాలపల్లి జిల్లా అగ్నిమాపక అధికారి కేవీ సతీష్ కుమార్ తెలిపారు. గెస్ట్‌హౌస్ ఇనుప షెడ్లతో నిర్మించిన ఒక తాత్కాలిక నిర్మాణం అని తెలిపారు. బ్యారేజీని సందర్శించే అధికారులు అక్కడ బస చేసి సమావేశాలు నిర్వహిస్తారని… అది ఆదివారం కావడంతో అగ్నిప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేరని తెలిపారు. ఎల్&టి అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, అగ్నిప్రమాదంలో ధ్వంసమైన ఫైళ్లు, కంప్యూటర్లు ‘ప్రైవేట్ ఆస్తి అని, వాటికి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
FIRE ACCIDENT : ఎల్ అండ్ టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం
ఎల్ & టీ గెస్ట్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబత్‌పల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో ఉన్న లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్&టి) గెస్ట్‌హౌస్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భవనంలోని చాలా భాగం పూర్తిగా కాలిపోయింది. సమీపంలోని పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చుతుండగా మంటలు చెలరేగి, ప్రమాదవశాత్తు గెస్ట్ హౌస్‌కు వ్యాపించాయని ప్రాథమిక సమాచారం. భవనం రెండు వైపులా విస్తరించి ఉందని, అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఒక వైపు పూర్తిగా […]

Fire Accidnet
Last Updated: 25 May 2026, 07:50 AM IST