Site icon HashtagU Telugu

Fire Accident: హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident

New Web Story Copy 2023 08 12t152940.327

Fire Accident: హైదరాబాద్ లోని చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చందానగర్ లోని ఇన్ఫినిటీ మాల్‌లో ఉన్న సినిమాహాల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో ఉన్న మల్టీప్లెక్స్ సినిమా హాల్‌కు మంటలు వేగంగా వ్యాపించాయి. అదృష్టశావత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ఉదయం ఆరుగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పబ్లిక్ లేకపోవడంతోనే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదంటున్నారు స్థానికులు. మల్టీప్లెక్స్‌లోని ఐదు స్క్రీన్‌లలో మూడు స్క్రీన్ లు పూర్తిగా దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చేశారు. నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చందానగర్ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి విచారిస్తున్నారు. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: Jagtial: జగిత్యాలలో విషాదం, కుక్కకాటుతో 12 ఏళ్ల బాలిక మృతి