Site icon HashtagU Telugu

Budget 2024-25 : ఆర్థికమంత్రికి పెరుగు, చక్కెర తినిపించిన రాష్ట్రపతి ముర్ము

Murmu Nirmala Sitharaman

Murmu Nirmala Sitharaman

అందరూ ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్‌ను ఎన్డీఏ ప్రభుత్వ మరికాసేపట్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్ సామాన్యులకు వరంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అయితే.. పన్నుల్లో మినహాయింపు కల్పిస్తే ధరలు తగ్గడంతో పాటు ఉద్యోగులకు, వ్యాపారులకూ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఉద్యోగులకు టీడీఎస్ తగ్గి టేక్ హోమ్ శాలరీ పెరగొచ్చు. బంగారంపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తే బంగారు ఆభరణాల ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. కేంద్ర మంత్రివర్గం బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అంతకుముందు సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి.. బడ్జెట్ ప్రొవిజన్లను ఆమెకు వివరించారు. ఈ క్రమంలోనే ఆర్థికమంత్రికి రాష్ట్రపతి ముర్ము పెరుగు, చక్కెర తినిపించి గుడ్ లక్ చెప్పారు. కాసేపట్లో నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఈసారి కేంద్ర బడ్జెట్ కాస్త స్పెషల్ కానుంది. ఎందుకంటే మునుపెన్నడూ లేనట్లుగా ఈసారి మన దగ్గర ఐదుగురు కేంద్ర మంత్రులున్నారు. NDA సర్కారులో AP ప్రభుత్వం భాగస్వామిగా ఉండటం విశేషం. తెలంగాణ లోనూ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటోంది. దీంతో ఇరు రాష్ట్రాలకు ‘మోదీ 3.0’ మునుపటి కంటే ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఈ బడ్జెట్లో ‘కేంద్ర మంత్రులు’ ఏమేరకు నిధులు తెప్పిస్తారో చూడాల్సి ఉంది.

అయితే.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో రైతుల కోసం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ.8,000కు పెంచవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తాన్ని ఏడాదికి 4 వాయిదాల్లో ఇస్తారని తెలుస్తోంది. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతారని భావిస్తున్నారు. దీని వల్ల రైతులు ఈ రుణాన్ని సులభంగా తీసుకునే అవకాశం లభిస్తుంది.

Read Also : Budget 2024: బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధ‌మైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి కూడా పేప‌ర్ లెస్‌..!