Site icon HashtagU Telugu

Road Accident: దసరా ముందు తండ్రీకూతుళ్లు మృతి.. అల్లుడికి తీవ్రగాయాలు

Road Accident

Road Accident

Road Accident: దసరా పండుగ పురస్కరించుకుని పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతుండటంతో బస్టాప్ లు, రైల్వే స్టేషన్ లు కిక్కిరిసిపోతున్నాయి. మరికొందరు తమ సొంత వాహనాల్లో సొంతూళ్లకు పయనమవుతున్నారు. అయితే దసరాకు కూతురు, అల్లుణ్ని పిలిచి పండుగ చేసుకుందామని అనుకున్న ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అత్తారింటి నుంచి కూతురు, అల్లుణ్ని తండ్రి బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో మృత్యుశకటంలా దూసుకొచ్చిన ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు.

వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలకు చెందిన వెంకన్న.. కూతురు అనూష, అల్లుడు రాజేశ్‌ను ఇంటికి తీసుకెళ్లేందుకు శనివారం సాయంత్రం కూతురు ఇంటికి వెళ్లాడు. కూతురు, అల్లుణ్ని వెంటబెట్టుకుని రాత్రి సమయంలో బైక్‌పై బయల్దేరాడు కిష్టాపురం సమీపానికి రాగానే బైక్‌ను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న, అనూష మృతి చెందగా, రాజేశ్‌ గాయాలపాలయ్యాడు. రాజేశ్‌ను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: Tragedy : దసరా పండగ వేళ ..విహార యాత్ర ..విషాదం నింపింది