Site icon HashtagU Telugu

TG Number Plates: 18 లక్షలకు అమ్ముడుపోయిన టీజీ నంబర్‌ ప్లేట్

TG Number Plates

TG Number Plates

TG Number Plates: వేలంలో టీజీ నంబర్‌ ప్లేట్ భారీ ధరకు అమ్ముడుపోయింది. ఈ వేలానికి ఐదుగురు పోటీపడ్డారు. శుక్రవారం హైదరాబాద్(Hyderabad) నగరంలో ఫ్యాన్సీ టీజీ నంబర్ ప్లేట్‌లను వేలం వేయగా సికింద్రాబాద్(Secunderabad) ఆర్టీఓ ఒక నంబర్ ప్లేట్ కి రూ.18.28 లక్షలు దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో అనేక నంబర్ ప్లేట్లు వేలం వేయగా మూడు ఫ్యాన్సీ నంబర్లు లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి. TG 10 9999 నంబర్ ప్లేట్‌ను రూ. 6,00,999కి విక్రయించారు. దానిని కొనుగోలు చేసేందుకు ఐదుగురు పోటీదారులు పోటీ పడ్డారు.

నంబర్ ప్లేట్‌లు 10A 0001 మరియు 10A 0009 వరుసగా రూ. 3.60 లక్షలు మరియు 2.61 లక్షలకు వేర్వేరు వ్యక్తులు దక్కించుకున్నారు. అయితే చివరిది ‘TG-10A-0005’ కేవలం రూ. 51,500కి మాత్రమే అమ్ముడైంది. ఈ ఏడాది ప్రారంభంలో నగరంలో ఫ్యాన్సీ టీజీ ప్లేట్ల వేలం ప్రారంభం కావడంతో ఆర్టీఏ రూ.30 లక్షలను సేకరించింది. మార్చిలో ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీజీ సిరీస్‌ను విడుదల చేశారు.

మొదటి ప్లేట్ TG 09 0001 వేలంలో రూ. 9.61 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది. TG 09 0909, 09 0005, 09 0002, 09 0369, మరియు 09 0007 నంబర్ ప్లేట్లు వరుసగా రూ. 2.30 లక్షలు, రూ. 2.21 లక్షలు, రూ. 1.2 లక్షలు, రూ. 1.20 లక్షలు మరియు రూ. 1,07 లక్షల మొత్తాలకు కొనుగోలు చేశారు. వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.30,49,589. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ‘TS’ నుండి ‘TG’ గా మార్చాలని నిర్ణయించింది. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాహన యజమానులకు TG నంబర్ ప్లేట్ అందుతుంది. అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలను మార్చాల్సిన అవసరం లేదు.

Also Read: Ganta Srinivasa Rao : గంటా ఆస్తులు వేలం..?