PUBG Love: పబ్జి గేమ్ ద్వారా ప్రేమ .. పాకిస్థాన్ నుండి ప్రియుడు కోసం భారత్ కు

ఆన్‌లైన్ గేమ్ ప్లాట్‌ఫారమ్ పాకిస్థానీ మహిళ, భారతీయుడు పరిచయమయ్యారు. కొంతకాలానికే వారిద్దరి మనసులు కలిశాయి.

Published By: HashtagU Telugu Desk
PUBG Love

New Web Story Copy 2023 07 16t125857.265

PUBG Love: ఆన్‌లైన్ గేమ్ ప్లాట్‌ఫారమ్ లో పాకిస్థానీ మహిళ, భారతీయుడు పరిచయమయ్యారు. కొంతకాలానికే వారిద్దరి మనసులు కలిశాయి. ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోయారు. కలిసి బ్రతకాలి అనుకున్నారు. అనుకున్నట్టే ఆ మహిళ ఇండియాకి వచ్చింది. విశేషం ఏంటంటే సదరు మహిళ నలుగురు పిల్లల తల్లి.

పబ్జి గేమ్ ద్వారా సీమా (30), సచిన్ (22) పరిచమయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో తన ప్రియుడి కోసం సిమా దొంగతనంగా భారత్ కి వచ్చింది. వారిద్దరు నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తున్నారు. సచిన్ ప్రొవిజన్ స్టోర్ నడుపుతున్నాడు. అయితే నేపాల్ మీదుగా వీసా లేకుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినందుకు సీమా జూలై 4న అరెస్టు అయింది. అక్రమంగా వచ్చిన మహిళకు వసతి కల్పించినందుకు సచిన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా వారు ఇటీవల జైలు నుండి విడుదలైనప్పటికీ ఆమె పాకిస్థాన్ వెళ్లాలని అనుకోవట్లేదట.

Read More: Allu Arha : ఎన్టీఆర్ దేవర సినిమాలో అల్లు అర్జున్ కూతురు? రెమ్యునరేషన్‌ కూడా భారీగానే?

  Last Updated: 16 Jul 2023, 01:02 PM IST