Fake Doctor: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో వైద్య రంగాన్ని కుదిపేసే ఒక తీవ్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. కేవలం ఎంబీబీఎస్ డిగ్రీ కలిగిన ఒక నకిలీ వైద్యుడు, ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తూ ఎన్నో గుండె శస్త్రచికిత్సలు చేసిన విషయమెలాంటి విషాదం నెలకొనేసింది. ఫరీదాబాద్‌లోని బాద్‌షా ఖాన్ సివిల్ ఆసుపత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఎంబీబీఎస్ డిగ్రీతో కార్డియాలజిస్ట్‌గా నటన
డాక్టర్ పంకజ్ మోహన్ శర్మ అనే వ్యక్తి, గత ఎనిమిది నెలలుగా కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తూ 50కి పైగా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు నిర్వహించాడు. గుండె శస్త్రచికిత్సలు అత్యంత సాంకేతికత, అర్హతలతో కూడినవి. కానీ అతనికి అటువంటి ప్రత్యేకతలేమీ లేవు. అతనికి కేవలం ఎంబీబీఎస్ పట్టా మాత్రమే ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
డాక్టర్ శర్మ, ప్రస్తుతం సేవలందిస్తున్న ఒరిజినల్ కార్డియాలజిస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను దుర్వినియోగం చేసి, తనను తాను నిపుణుడిగా ప్రొజెక్ట్ చేశాడు. అతని చేతిలో చికిత్స పొందిన పేషెంట్లలో పలువురు తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొన్నారని, మరికొందరు మరణించారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Telangana Cabine : పాపం.. మంత్రి పదవి ఫిక్స్ అనుకోని భంగపాటుకు గురైన నేతలు
ఈ మోసం, డాక్టర్ శర్మ చేతిలో చికిత్స పొందిన ఓ రోగి తన ఆరోగ్యంపై అనుమానం కలిగి, నిజమైన కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడంతో బహిర్గతమైంది. ఆ తర్వాత ఆసుపత్రి యాజమాన్యం విచారణ చేపట్టి, డాక్టర్ శర్మ సమర్పించిన విద్యా ప్రమాణాలు నకిలీగా నిర్ధారించింది.
వాస్తవాలు బయటపడిన వెంటనే ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ శర్మను విధుల నుంచి వెంటనే తొలగించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. “అతడికి గుండె శస్త్రచికిత్సలు చేయడానికి ఎలాంటి అధికారిక అర్హత లేదు. ఇది అత్యంత తీవ్రమైన నేరం. ఈ మోసం వెనుక మరెవ్వరైనా ఉన్నారేమో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం,” అని పోలీసులు తెలిపారు.
WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విజేతను ఎలా ప్రకటిస్తారు?