Union Minister Ram Mohan Naidu : ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ మాట్లాడుతూ..వరంగల్, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రకటన చేశారు. తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు . వరంగల్‌లో కచ్చితంగా ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ చెప్పారు.
పెద్దపల్లిలో విమనాశ్రయం ఏర్పాటుకు కొన్ని సమస్యలు ఉన్నాయి అని కేంద్రమంత్రి రామ్మోహన్ చెప్పారు. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు ఆదనంగా కొత్తగూడెం దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు అనువైన స్థలం ఉందని సీఎం కేంద్రమంత్రి రామ్మోహన్ చెప్పారన్నారు త్వరలో కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామని పేర్కొన్నారు.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. అదేవిధంగా తెలంగాణ పెండింగ్ అంశాలపై, విభజన హామీలపై మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశా నిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి.
Read Also: Google Calendar : గూగుల్ క్యాలెండర్‌లో కొత్తగా ‘ఫుల్ స్క్రీన్’ ఫీచర్.. ఏమిటిది ?