Site icon HashtagU Telugu

Fraud : విద్యాసంస్థలో భారీ లాభాలని ఆశ చూపి.. ఎన్నారైని నిండాముంచిన ఘరానా దంపతులు

Eluru Couple Fraud an NRI in the name of Education Business

Eluru Couple Fraud an NRI in the name of Education Business

విద్యాసంస్థలో భాగస్వామ్యం(Education Business) అని ఆశ చూపించి ఓ ఎన్నారై(NRI) నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి నిండాముంచేసిన కేసులో ఏలూరుకు(Eluru) చెందిన దంపతులు నందిగం రాణి-ధర్మరాజులను హైదరాబాద్(Hyderabad) లో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

తడికలపూడిలో ఉన్న విద్యాసంస్థలో పార్ట్‌నర్ షిప్ ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు దంపతులపై ఏపీ, తెలంగాణలో కేసులు నమోదైనట్లు గుర్తించారు. శ్రీనివాస్ అమెరికాలో ఉన్న తన స్నేహితుడు సుధాకర్ సూచన మేరకు రాణి-ధర్మరాజు దంపతులను కలిసి విడతల వారిగా 7 కోట్ల 27 లక్షల 85వేల 584 రూపాయలు ఇచ్చి విద్యాసంస్థలో భాగస్వామిగా చేరారు.

ఇటీవల తన పెట్టుబడి సొమ్ము మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడగగా చంపుతామని ఆ దంపతులు బెదిరించారని శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ తెలుగు రాష్ట్రాల్లోని పలువురు వ్యాపారవేత్తల నుండి 35 కోట్ల రూపాయలను వసూలు చేసి.. తిరిగి ఇవ్వాలని అడిగిన వారిని చంపుతామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాణి-ధర్మరాజు లను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని, గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు.

 

Also Read : Road Accident: రోడ్డు ప్రమాదానికి గురైన పెళ్లి వ్యాన్