Elephants: పుంగనూరులో ఏనుగుల గుంపు హల్‌చల్‌.. రైతును తొక్కి చంపిన వైనం

Elephants: దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఈ ఏనుగుల గుంపు పంటలకు పెద్ద స్థాయిలో నష్టం కలిగించింది. ముఖ్యంగా వరి పంటను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు నుండి పీలేరు వైపు వెళ్తున్న 15 ఏనుగులు, పీలేరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.

Published By: HashtagU Telugu Desk
Elephants Attack

Elephants Attack

Elephants: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అటవీ ప్రాంతం నుంచి పంట పొలాల మీదకి దూసుకెళ్లిన ఏనుగుల గుంపు తీవ్ర విధ్వంసం సృష్టించింది. దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, , ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఈ ఏనుగుల గుంపు పంటలకు పెద్ద స్థాయిలో నష్టం కలిగించింది. ముఖ్యంగా వరి పంటను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు నుండి పీలేరు వైపు వెళ్తున్న 15 ఏనుగులు, పీలేరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి. ఈ గుంపు మామిడి తోటలను పూర్తిగా ధ్వంసం చేసింది, అందులో రాజారెడ్డి అనే మామిడి తోట యజమాని తీవ్రంగా గాయపడగా, అతను ఈ దాడిలో మృతి చెందాడు.

Maharashtra Elections : మహారాష్ట్రలో 14 మంది అధికారులు బదిలీ
ఈ ఘటన జరిగిన తర్వాత, స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. రైతులు అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు, ఈ దాడి వల్ల కలిగిన విధ్వంసంపై వారు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఈ ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతానికి పంపించే చర్యలపై దృష్టి సారించారు. ఈ మద్య, ఏనుగుల సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య ఏనుగుల దాడుల గురించి ఒప్పందాలు కూడా జరిగాయి. చిత్తూరు, మన్యం, విజయనగరం, , పార్వతీపురం జిల్లాల్లో పంటపొలాలపై ఏనుగుల దాడి కేసులు పెరిగాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సమస్యకు సంబంధించి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో జరగలేదని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

1. ఏనుగులకు మనుషులకు మధ్య ఎలా ఉండాలి అనే అంశం.
2. మావటీలకు కావటీలకు శిక్షణ.
3. కుంకీ ఏనుగులను ఏపీకి తరలింపు.
4. ఏనుగుల శిబిరాల సంరక్షణ, ఆహారం.
5. ఎర్రచందనం, శ్రీగంధం సమస్యలకు జాయింట్ టాస్క్ ఫోర్స్.
6. అడవులలో ఏం జరుగుతుందో రియల్ టైంలో తెలిసేలా ఐటీ అభివృద్ధి వంటి అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది.

US Vs Iran : ట్రంప్‌కు ఏదైనా జరిగితే వదలం.. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్

  Last Updated: 15 Oct 2024, 01:08 PM IST