Electric Buses: నేడు హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Electric Buses

Safeimagekit Resized Img (3) 11zon

Electric Buses: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. కాగా అద్దె ప్రాతిపదికన తీసుకోనున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నాయి. 22 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చిన TSRTC. మహాలక్ష్మి స్కీమ్ కింద నడవనున్న నాన్ ఏసి ఎలక్ట్రిక్ బస్సులు. ఈ బ‌స్సుల్లో కూడా మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని అధికారులు తెలిపారు.

Also Read: Sehri: నేటి నుంచే రంజాన్‌ ఉపవాస దీక్షలు.. సెహ్రీ సమయంలో ఈ 5 పదార్థాలు తినవద్దు..!

హైదారాబాద్ మ‌హా నగరంలోని అన్ని ప్రాంతాలకు ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు న‌డ‌వ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఎల‌క్ట్రిక్‌ బస్సులను ఛార్జ్ చేసేందుకు బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌, కంటోన్మెంట్‌, హెచ్‌సీయూ, రాణిగంజ్‌ డిపోల్లో స‌దుపాయాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్‌ బస్సులను ప్రత్యేకంగా సమకూర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో 125 మెట్రో డీలక్స్‌లు ఉన్నాయి. ఈ బస్సులు జూన్‌లో అందుబాటులోకి రానున్నాయి. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కాగా 140 ఆర్డినరీ బస్సులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ బస్సులన్నిటిలో మ‌హాల‌క్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని అధికారులు వివ‌రించారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 12 Mar 2024, 10:26 AM IST