Telangana: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 30వ తేదీని రాష్ట్ర ఉద్యోగులు, కార్మికులందరికీ సెలవు దినంగా ప్రకటించింది. ఆ రోజున కర్మాగారాలు, వ్యాపారాలు, పరిశ్రమలను మూసివేయాలని సూచనలతో రాష్ట్ర కార్మిక శాఖ దీనిని వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నవంబర్ 30న జరగనున్న అర్హులైన ఓటర్లను ఓటింగ్ లో పాల్గొనేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలోని 33 జిల్లాల్లోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటు వేయనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Also Read: Maoist: మావోల ఎన్నికల బహిష్కరణ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల హైఅలర్ట్!