ఒమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ నెల 27న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓమిక్రాన్ వ్యాప్తి మరియు కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులను పరిశీలిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం త్వరలో ముగియనుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆయా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయం కీలకంగా మారనుంది. కాగా, వచ్చే వారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తానని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షిస్తామని చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనేది నిర్ణయిస్తామని సీఈసీ తెలిపింది.
UP Elections:అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది
