Earthquake: బంగాళాఖాతంలో 4.4 తీవ్రతతో భూకంపం

సోమవారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌ఎస్‌సి) తెలిపింది

Earthquake: సోమవారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌ఎస్‌సి) తెలిపింది. భూ ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు ఏజెన్సీ వెల్లడించింది. ఈ భూకంప సంఘటన కేంద్రం అక్షాంశం 9.75 డిగ్రీల ఉత్తరం, రేఖాంశం 84.12 డిగ్రీల తూర్పున ఉంది. సోమవారం తెల్లవారుజామున 1.29 గంటలకు భూకంపం సంభవించింది. అంతకుముందు శనివారం త్రిపురలోని ధర్మనగర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 43 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం నమోదైంది.

Also Read: Free Heart Surgeries : నిమ్స్ లో ఫ్రీగా పిల్లలకు హార్ట్ సర్జరీలు.. ఎప్పటి నుంచి అంటే ?