Site icon HashtagU Telugu

Hyderabad: డ్రగ్స్ కేసులో కోర్టుకు హాజరై కోర్టు భవనం నుంచి దూకి ఆత్మహత్య

Hyderabad

Hyderabad

Hyderabad: డ్రగ్స్ కేసులో పట్టుబడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నిందితుడు సలీముద్దీన్(27) వృత్తిరీత్యా రాపిడో డ్రైవర్‌ గా పని చేసేవాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన అతను డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించాడు.

2022లో బంజారాహిల్స్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కాగా మూడు వారాల క్రితం చంచల్‌గూడ సెంట్రల్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు.అయితే పోలీసులు అతనిపై నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులోని మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ముందు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభమైనప్పటికీ సలీముద్దీన్ కోర్టుకు హాజరుకాలేదు. ఈ రోజు బుధవారం మధ్యాహ్నం కోర్టుకు వచ్చి మూడో అంతస్తుకు వెళ్లి అక్కడ తన న్యాయవాది షబానా మునవర్‌ను కలిశాడు. ఆమెను కలిసిన తర్వాత సలీముద్దీన్ కోర్టు భవనంపై నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలైన సలీముద్దీన్ ను కోర్టులోని సెక్యూరిటీ సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహ్మద్ సలీముద్దీన్ మనస్థాపానికి గురై ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని నాంపల్లి ఇన్‌స్పెక్టర్ బేగరి అభిలాష్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు

Also Read: Adilabad : మహిళ ఎస్సై అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన అంగన్‌వాడీలు