Drone Without License : పౌరులు ఉపయోగించే డ్రోన్ల ఎగుమతి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది.
వ్యాపార, వైద్య, సినిమా, టూరిజం రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
25 కిలోమీటర్లలోపు రేంజ్ కలిగిన డ్రోన్లను లైసెన్స్ లేకుండా ఎగుమతి చేయడంతో పాటు తయారు చేయొచ్చని ప్రకటించింది.
ఈ నిర్ణయంతో దేశంలో డ్రోన్ల తయారీకి ప్రోత్సాహం లభించనుంది. ఫలితంగా వాటి ఉత్పత్తి పెరిగి, తక్కువ రేట్లకే అందుబాటులోకి వస్తాయి.
పౌరులు ఉపయోగించే డ్రోన్లు ఇదివరకు కేంద్ర ప్రభుత్వం యొక్క ‘స్పెషల్ కెమికల్ ఆర్గానిజమ్స్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ’ లిస్టులో ఉండేవి. ఇప్పుడు వాటిని ఆ జాబితా నుంచి తొలగిస్తూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. దేశంలో డ్రోన్ల తయారీని ప్రోత్సహిస్తూనే, పౌరులు వినియోగించే డ్రోన్ల ఎగుమతిపై ఉన్న పరిమితులను సడలించామని పేర్కొంటూ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు. 2030 నాటికి భారత్‌ను డ్రోన్‌ల తయారీ కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. పౌరులు వాడే 25 కిలోమీటర్ల లోపు రేంజ్ కలిగిన డ్రోన్‌లు, మానవరహిత వైమానిక వాహనాలు (UAV) ‘జనరల్’ కేటగిరి కింద ఎగుమతికి అనుమతించబడుతాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) తెలిపింది. వాటి ఎగుమతికి ఇక SCOMET లైసెన్స్ అవసరం లేదని(Drone Without License) పేర్కొంది.
Also read : Russia Private Army : రష్యా ప్రైవేటు సైన్యాన్ని ఏం చేయబోతున్నారో తెలుసా ?
ఇండియా నుంచి 100 దేశాలకు 10వేల డ్రోన్లు
గరుడ ఏరోస్పేస్ డ్రోన్ల తయారీ కంపెనీ. ఇది రూ.180 కోట్లను సమీకరించింది. కేంద్ర సర్కారు మార్చిన నిబంధనలు ఈ కంపెనీకి బాగా హెల్ప్ చేయనున్నాయి. గరుడ ఏరోస్పేస్ కు మలేషియా, యూఏఈ, పనామా సహా అనేక దేశాల నుంచి డ్రోన్ల కోసం బల్క్ ఆర్డర్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు 10,000 డ్రోన్‌లను ఎగుమతి చేయాలనే టార్గెట్ తో ఆ కంపెనీ ఉంది.
Ideaforge Technology కంపెనీ IPOకు జాక్ పాట్
దేశంలోని అతిపెద్ద డ్రోన్ తయారీ సంస్థ Ideaforge Technology షేర్ మార్కెట్‌లో లిస్ట్ కాబోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఫలితంగా ఈ కంపెనీ IPO ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంది. IdeaForge కంపెనీ IPO ఈరోజే (జూన్ 26న) ప్రారంభమవుతుంది. దీని షేర్లు జూలై 7న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో లిస్ట్ అవుతాయి.