Cyber Crime: ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో కాల్స్‌ లిఫ్ట్ చేయవద్దు: రాచకొండ పోలీస్

దేశంలో సైబర్‌ నేరాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు.

Cyber Crime: దేశంలో సైబర్‌ నేరాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. సైబర్ నేరాలకు ఇంటర్నెట్ వినియోగం ఒక కారణంగా చెప్తున్నారు పోలీసులు. సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా మెట్రో ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. తాజాగా రాచకొండ పోలీసులు నగర ప్రజలను హెచ్చరించారు.

సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో కాల్స్‌ను లిఫ్ట్ చేయవద్దని రాచకొండ పోలీసులు ప్రజలను కోరారు. నగరంలో ఇంటర్నెట్ ద్వారా జరిగే ఫైనాన్స్ మోసాలు పెరగడంతో సైబర్ అలర్ట్ జారీ చేశారు. ఇక సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్ ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు రాచకొండ పోలీసులు హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు నగ్నంగా వీడియో కాల్ చేసి వీడియో రికార్డ్ చేసి డబ్బును డిమాండ్ చేస్తారని పోలీసులు పేర్కొన్నారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసానికి గురైన బాధితులు ఆలస్యం చేయకుండా వెంటనే 1930కి కాల్ చేయాలని అభ్యర్థించారు. ప్రజలు కూడా 8712662111 నంబర్‌కు కాల్ చేసి ఏదైనా సైబర్ మోసం జరిగితే రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

Read More: Smartwatch: అద్భుతమైన లుక్ తో అదరగొడుతున్న స్మార్ట్ వాచ్.. పూర్తి వివరాలివే?