Site icon HashtagU Telugu

TSRTC: పాపులారిటీ కోసం ఇలాంటివి చేయొద్దు, సజ్జనార్ వార్నింగ్!

Tsrtc

Tsrtc

సోషల్ మీడియా (Social Media) రాకతో నేటి యువత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. లైక్స్, కామెంట్స్ (Comments) కోసం వెంప్లరాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో ఇతరులకు ఇబ్బందులు కలిగే ప్రమాదకరంగా స్టంట్స్ (Stunts) చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) ట్వీట్ వైరల్ (Viral) గా మారింది.

ద్విచక్రవాహనంపై వెళ్తూ టీఎస్‌ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కాలుతో నెడుతున్నట్లుగా ఓ యువకుడు తీసుకున్న వీడియో ఘటనపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ కోసం రహదారులపై (Main Road) ఇలాంటివి చేయవద్దని హెచ్చరించారు.

Also Read: Pushpa2 Audio Rights: ఆడియో రైట్స్ లో ‘పుష్ప2’ రికార్డ్.. ఏకంగా 60 కోట్లకుపైగా!