Site icon HashtagU Telugu

Jagtial: జగిత్యాలలో విషాదం, కుక్కదాడిలో గాయపడ్డ బాలిక మృతి

Govt Bans Dogs

Dogs

Jagtial: కుక్కకాటు మరో బాలిక ప్రాణాలను బలిగొంది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడింది. రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో జరిగింది. పదిహేను రోజుల కిందటే పిచ్చి కుక్క దాడి చేసింది.

పట్టణంలో దాదాపు పది మంది గాయపడ్డారు. కానీ కుక్కల దాడిలో సంగెపు సాహితి అనే 12 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆ చిన్నారి చికిత్స పొందుతూ ఈరోజు (శనివారం) ఉదయం మృతి చెందింది. తమ ముందు ఆడుకున్న చిన్నారి ఇక లేదని తెలిసి గ్రామం విషాదంలో మునిగిపోయింది.

Also Read: Harish Rao: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే: మంత్రి హరీశ్ రావు