Telangana: సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన వికలాంగులు

తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు పెన్షన్‌ మొత్తాన్ని 3,016 నుంచి 4,016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో 5 లక్షల మందికి పైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుంది

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు పెన్షన్‌ మొత్తాన్ని 3,016 నుంచి 4,016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో 5 లక్షల మందికి పైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుంది. పింఛను పెంపు వల్ల నెలకు 205 కోట్ల 48 లక్షల రూపాయల మొత్తం ఆసరా కింద రాష్ట్రంలోని దివ్యాంగులకు అందనున్నది. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్ను పెంచబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

దివ్యాంగులకు పింఛన్ పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, ఇతర వికలాంగుల సంఘాల నేతలు. మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: Bus Accident: బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదంలో 17 మంది జల సమాధి