Site icon HashtagU Telugu

Power Cuts Message Alert : విద్యుత్ కోతలపై మీకు అలర్ట్ మెసేజ్ పంపాలి తెలుసా ?

power

power

Power Cuts Message Alert : కరెంట్ ఎప్పుడు పడితే అప్పుడు బంద్ కావడం .. ఆ తర్వాత అసౌకర్యానికి గురికావడం మనకు అలవాటైపోయింది.

కానీ విద్యుత్తు చట్టం.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా సడెన్ గా పవర్ కట్స్ చేయడం కరెక్ట్ కాదని అంటోంది. 

కరెంటు సరఫరా నిలిపివేయడానికి  12 గంటల ముందే.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నారు అనే ఇన్ఫర్మేషన్ ను  వినియోగదారుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో పంపాలని నిర్దేశిస్తోంది.  

Also read : Running: మీరు ఫిట్‌గా ఉండటానికి రన్నింగ్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి..!

ఒకవేళ రిపేరింగ్ వర్క్స్ కోసం కరెంటు సరఫరాను నిలిపివేస్తే.. పట్టణాల్లో  6 గంటల్లోగా, గ్రామాల్లో 8 గంటల్లోగా కచ్చితంగా మళ్ళీ కరెంట్ సప్లై ను(Power Cuts Message Alert)  పునరుద్ధరించాలి.ఈ టైంలోగా పవర్ సప్లై రీస్టార్ట్ కాకపోతే డిస్కం నుంచి వినియోగదారులు పరిహారాన్ని పొందొచ్చు. విద్యుత్తు చట్టంలో ఈమేరకు సవరణలు జరిగాయి. అయితే వాటిని పర్ఫెక్ట్ గా అమలు చేయాలంటూ ఇటీవల కేంద్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది.  విద్యుత్ సప్లై తో ముడిపడిన ప్రాబ్లమ్స్ వస్తే.. మొదట కరెంట్ ఆఫీసులో తెలియజేయాలి. ఇలా కాకుండా డిస్కం వెబ్‌సైట్‌లో, ఈమెయిల్‌ ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. అయినా స్పందన రాకుంటే.. వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు కంప్లైంట్ చేయాలి. అక్కడ విచారణ జరిపి బాధితులకు పరిహారం ఇస్తారు.