Site icon HashtagU Telugu

D.Srinivas Dies: డి శ్రీనివాస్‌ మృతి పట్ల పవన్‌ కల్యాణ్‌ సంతాపం

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

D.Srinivas Dies: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీనివాస్ మరణవార్త బాధాకరమని పేర్కొన్న కళ్యాణ్, జనసేన పార్టీ ఎదుగుదల కోసండీఎస్ ఆకాంక్షించారని గుర్తు చేసుకున్నారు.

డీఎస్ సుదీర్ఘ రాజకీయ జీవితాన్నికాంగ్రెస్ లో గడిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్ ఉనికిని గుర్తించిన కళ్యాణ్, ఆయనను పలు సందర్భాల్లో కలిశారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయాణం, అభివృద్ధి గురించి ఇద్దరం ట్లాడుకునేవాళ్లమని . ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ మరియు ఇతర కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్.

Also Read: Jai Bolo Telangana Heroine : పెళ్లి చేసుకున్న ‘జై బోలో తెలంగాణ’ హీరోయిన్