Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) వరంగల్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. వరంగల్‌కు వెళ్తున్న క్రమంలో జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: JC Prabhakar Reddy : ‘‘నేను మాట్లాడింది తప్పే..’’ నటి మాధవీలతకు జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణలు
అంతకుముందు యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అలాగే రైతుబంధుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధుపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ భూములపై రైతుబంధు ఇవ్వమని డిప్యూటీ సీఎం మరోసారి క్లారిటీ ఇచ్చారు. 5 ఎకరాల లోపు రైతులకు పూర్తిగా నిధులు విడుదల చేశామని ప్రకటించారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటికే క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.