Site icon HashtagU Telugu

Air India: ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం

Air India

New Web Story Copy 2023 06 06t185220.766

Air India: ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా రష్యాకు దారి మళ్లించారు. విమానాన్ని సురక్షితంగా రష్యాలో ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. సాంకేతిక లోపంపై విచారణ జరుపుతున్నారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ ఎయిర్‌పోర్ట్ ఢిల్లీ) నుంచి టేకాఫ్ అయిన తర్వాత ఎయిరిండియా విమానం ఏఐ173 అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వెళుతోందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలో విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా విమానాన్ని రష్యాలోని మగదాన్ నగరం వైపు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

కాగా… మగదాన్ విమానాశ్రయంలో ప్రయాణీకులకు అన్ని సహాయాలు అందిస్తున్నామని, వీలైనంత త్వరగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు.

Read More: Telangana TDP: త్వరలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం: రావుల