Delhi Police PCR: ఢిల్లీ పోలీసుల పెట్రోలింగ్ విభాగానికి 400 కొత్త వాహనాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ముగిసిన G20 సమ్మిట్ కారణంగా ఢిల్లీ పోలీసుల పెట్రోలింగ్ యూనిట్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి 400 కొత్త పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Delhi Police PCR: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ముగిసిన G20 సమ్మిట్ కారణంగా ఢిల్లీ పోలీసుల పెట్రోలింగ్ యూనిట్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి 400 కొత్త పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ పోలీసులు G20 శిఖరాగ్ర సమావేశానికి ముందు మారుతీ సుజుకి ఎర్టిగా, మహీంద్రా స్కార్పియో, టయోటా ఇన్నోవా మరియు మహీంద్రా బొలెరో నియో 850 ఫోర్-వీలర్లను కొనుగోలు చేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 19 దేశాలకు చెందిన ప్రముఖులు ఢిల్లీకి వచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సమావేశాలు నిర్వహించారు.ఈ వాహనాలు ఇప్పుడు పోలీస్ కంట్రోల్ రూమ్(PCR), భద్రత మరియు జిల్లా పోలీసులతో సహా వివిధ విభాగాలలో పంపిణీ చేయనున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలు ఎక్కువగా G20 సదస్సు సందర్భంగా ప్రముఖుల కాన్వాయ్‌లో ఉపయోగించారు, అయితే సమ్మిట్ ముగిసిన తర్వాత ఈ వాహనాలను ఢిల్లీ పోలీసు విభాగాలలో పంపిణీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు.

Also Read: Sports Business Awards 2023: బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం