Site icon HashtagU Telugu

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో జుగుప్సాకరమైన సంఘటన.. తల్లి చూస్తుండగానే అలా?

Delhi Metro

Delhi Metro

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకుంటున్నా వికృత చర్యలకు సంబంధించిన వీడియోలు వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అధికారులు అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ యువత చేసే వికృత చర్యలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక విషయంతో ఢిల్లీ మెట్రో పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. తాజాగా కూడా ఢిల్లీ మెట్రో రైల్లో అతి జుగుప్సాకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

తల్లితో రైలులో ప్రయాణిస్తున్న ఒక మైనర్‌ బాలికపై ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మైనర్ బాలికను చూస్తూ మెట్రో ట్రైన్ లో అందరూ చూస్తుండగానే ఆ యువకుడు హస్తప్రయోగం చేశాడు. అది గమనించిన ఆ తల్లి కూతురితో సహా కిందకు దిగిపోగా సదరు నీచుడ్ని మెట్రో సిబ్బందికి అప్పగించారు తోటి ప్రయాణికులు. ఢిల్లీ మెట్రో రైలు రెడ్‌ లైన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. రక్షాబంధన్‌ కావడంతో నిన్న సాయంత్రం అంతా మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

ఈ క్రమంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్‌ లైన్‌లో ప్రయాణిస్తున్న రైలులో ఒక ప్రయాణికుడు.. ఆ తోపులాటలో పక్కనే ఉన్న బాలికను చూస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆపై స్టేషన్‌ సిబ్బంది ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఆ కామాంధుడి స్వస్థలం పశ్చిమ బెంగాల్‌ అని, పని కోసం ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంటనే అతనిని దారుణంగా శిక్షించండి. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ఘటనలు మెట్రోలో జరగకుండా చూసుకోండి అంటూ మెట్రో రైల్వే అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు నెటిజన్స్.