BJP OBC Protest: తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ ఓబీసీ విభాగం కార్యకర్తలు ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు నుండి తెలంగాణ భవన్ వరకు కవాతు చేశారు. పోలీసులు అప్రమత్తమై తెలంగాణ భవన్ వెలుపల భారీ బారికేడింగ్‌లు ఏర్పాటు చేశారు. నిరసన కారుల్ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరియు రాష్ట్రంలో నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినట్టు ఢిల్లీ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సునీల్ యాదవ్ తెలిపారు.
ఇదిలా ఉండగా తెలంగాణాలో ఎన్నికల హడావుడి మొదలైంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఈ రోజు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల్ని కలిసి ఎన్నికల దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా కొందరికి బీఫామ్ అందజేశారు. మరోవైపు ఈ రోజు కాంగ్రెస్ 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా అభ్యర్థుల్ని పొత్తులతో కూడిన జాబితాను త్వరలోనే విడదల చేయనుంది. అటు బీజేపీ ఇంకా తమ ప్రచారాన్ని మొదలు పెట్టలేదు. ఈ రోజు వరకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఎవరో కూడా ప్రకటించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
Also Read: Audi India: 88 శాతం వృద్ధి చెందిన ఆడి ఇండియా