Deepika Padukone: ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో మెరిసిపోతున్న దీపికా పదుకొణే

ఆస్కార్ 2023 అకాడమీ అవార్డుల వేదికపై నాటు నాటు పాట ప్రదర్శనకు ముందు దీపికా పదుకొణె నల్లటి గౌన్ తో (లూయిస్ విట్టన్ గౌన్) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Deepika Padukone Shines At The Oscars

Deepika Padukone Shines At The Oscars

ఆస్కార్ 2023 అకాడమీ అవార్డుల వేదికపై నాటు నాటు పాట ప్రదర్శనకు ముందు దీపికా పదుకొణె (Deepika Padukone) నల్లటి గౌన్ తో (లూయిస్ విట్టన్ గౌన్) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తద్వారా ఆమె చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీపిక అలా నడిచొస్తున్న సమయంలో చాలా మంది ఆమెను తదేకంగా చూశారు. ఆస్కార్ వేదికపై అంత గొప్పగా కనిపించేందుకు ఆమె కఠోర సాధన చేసిందంటే నమ్మగలరా ?

నిజమే ఆస్కార్ వేదిక కోసమే దీపికా పదుకొణె (Deepika Padukone) చాలా ప్రత్యేక సాధన చేసింది. ఫిట్ నెస్ ఇన్ స్ట్రక్టర్ యాస్మిన్ కరాచివాలా సూచనల మేరకు ఉదయమే 6.30 గంటల నుంచి దీపికా వర్కవుట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను యాస్మిన్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది . క్రమశిక్షణ, అంకిత భావం, సమతుల జీవనశైలి ఆమె అంత చక్కగా కనిపించేందుకు సాయపడినట్టు యాస్మిన్ పేర్కొన్నారు.

మరోవైపు ఆస్కార్ వేదికపై దీపిక ఎంత అందంగా కినిపించిందో అంటూ ప్రముఖ నటి కంగనా రనౌత్ సైతం వ్యాఖ్యానించింది. యావత్ దేశం తరఫున అక్కడ నుంచోవడం, తన భుజాలపై దేశ ఖ్యాతిని మోస్తూ, నమ్మకంగా మాట్లాడడం అంత ఈజీ కాదని పేర్కొంది. భారతీయ మహిళలు అత్యత్తమం అని చెప్పడానికి దీపిక నిదర్శనమంటూ కంగనా రనౌత్ తన స్పందన వ్యక్తం చేశారు.

Deepika (4)

Also Read:  Sunburn Tips: వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

  Last Updated: 13 Mar 2023, 01:10 PM IST