Deepika Padukone: శ్రీవారి సేవలో దీపికా పదుకొణే!

తిరుమల తిరుపతి దేవస్థానం బాలీవుడ్ నటీమణులకు సెంటిమెంట్ గా మారింది.

  • Written By:
  • Publish Date - June 10, 2022 / 12:48 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం బాలీవుడ్ నటీమణులకు సెంటిమెంట్ గా మారింది. పుట్టినరోజు, పెళ్లిరోజు.. ఆకేషన్ ఏదైనా తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. తాజాగా బ్యూటీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తండ్రి ప్రకాష్ పదుకొణె పుట్టినరోజును పురస్కరించుకుని తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. దీపికా పదుకొణె శుక్రవారం తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. తండ్రి-మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాష్ పదుకొణెతో కలిసి దీపికా పదుకొణె శుక్రవారం తిరుపతిలోని ఆలయంలో కనిపించింది. ప్రకాష్ పదుకొణె 67వ జన్మదినోత్సవం సందర్భంగా తిరుపతికి వచ్చారు. ఇటీవలే దీపికా పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసిన దీపికా తిరుమలలో ప్రత్యక్షమైంది.

దీపికా తెల్లటి కుర్తా-సల్వార్, మ్యాచింగ్ మాస్క్‌లో ఆకట్టుకుంది. దీపికా, ఆమె తండ్రికి ఆలయ నిర్వాహాకులు అందించిన పట్టుశాలువాలు ధరించారు. దీపికా వెంట సోదరి అనీషా పదుకొణె కూడా కనిపించింది. దీపిక తన మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా గతంలో తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం దీపికా షారుఖ్ ఖాన్ చిత్రం పఠాన్‌లో కనిపించనుంది. కేన్స్‌కు వెళ్లే ముందు, ఆమె స్పెయిన్‌లో షారుఖ్‌తో సినిమా షూటింగ్‌లో కొంత భాగాన్ని కంప్లీట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన అనేక చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం కూడా నటించనున్నారు.