Site icon HashtagU Telugu

BRS: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న “దీక్షా దివస్”: పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు

Deeksha Divas all over Telangana on 29th of this month: KTR

Deeksha Divas all over Telangana on 29th of this month: KTR

Diksha Divas program : ఈ నెల 29వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షాదివాస్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దిక్ష దివాస్ ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు . తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తోందని కేటీఆర్‌ తెలిపారు. 2009, నవంబర్ 29న తేదీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని కేటీఆర్‌ అన్నారు.

ఈ దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. దీక్షకు వెళ్లే ముందు తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండ వర్ణాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. కాగా, ఈనెల 29న కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొననున్నారు.

Read Also: IPL 2025 Mega Auction: బుల్లెట్‌ను దింపుతున్న హార్దిక్.. వేలంలో ముంబై టార్గెట్ అతడే!