Site icon HashtagU Telugu

David Warner Retirement: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్

David Warner

New Web Story Copy 2023 06 03t171850.930

David Warner Retirement: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి ఇంగ్లండ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్థాన్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లో వార్నర్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు.

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్వదేశంలో జరగనున్న సిరీస్ సందర్భంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వార్నర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో భారత్‌తో వచ్చే వారం ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత త్వరలో ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో అతను పాల్గొనే అవకాశం ఉంది.

డేవిడ్ వార్నర్ 1 డిసెంబర్ 2011న న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు 102 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 187 ఇన్నింగ్స్‌ల్లో 45.58 సగటుతో 8158 పరుగులు చేశాడు. వార్నర్ 25 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు సాధించాడు. డేవిడ్ వార్నర్ తన టెస్టు కెరీర్‌లో పాకిస్థాన్‌పై అత్యుత్తమ ఇన్నింగ్స్ (335*) ఆడాడు.

Read More: WTC 2023 Final: ఆస్ట్రేలియాపై కోహ్లీ పరుగుల వరద పారిస్తాడు: గ్రెగ్ చాపెల్